mahi raghav: వైఎస్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  • ఇంకా ఎవరినీ సంప్రదించలేదు 
  • త్వరలో నటీనటుల ఎంపిక 
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి     

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను దర్శకుడు మహి వి.రాఘవ్ రూపొందించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీని తెరకెక్కించిన ఈ దర్శకుడు మంచి మార్కులు సంపాదించుకున్నాడు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కోసం ఆయన రంగంలోకి దిగాడు.

 ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మమ్ముట్టిని .. ఆయన సరసన నయనతారను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం గురించి ఆయన స్పందించాడు. ఈ సినిమా కోసం ఇంకా ఎవరినీ సంప్రదించలేదనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక నటీనటుల ఎంపిక మొదలుపెడతామని అన్నాడు. విజయ్ చిల్లా .. శశీదేవి నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు.       

  • Error fetching data: Network response was not ok

More Telugu News