Mini Devi Kumam: పాకిస్థాన్ కు మరో నిక్ నేమ్ పెట్టిన ఇండియా... ఐరాసలో కొత్త పిలుపు!

  • ఇప్పటికే పాక్ ను 'టెర్రరిస్థాన్' అంటున్న భారత్
  • ఇప్పుడు స్పెషల్ టెర్రరిస్ట్ జోన్ అంటూ అభివర్ణన
  • సెజ్ ను గుర్తు చేస్తున్న ఎస్ టీజెడ్
  • ఆకర్షించిన మినీ దేవీ కుమమ్ ప్రసంగం

అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే పాకిస్థాన్ ను 'టెర్రరిస్థాన్' అని సంబోధిస్తూ, పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ఎండగడుతున్న ఇండియా, ఇప్పుడు మరో ప్రత్యేక పదాన్ని వాడుతూ పాక్ ను మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జెనీవాలో జరిగిన ఐరాస సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల విభాగంలో భారత రెండో కార్యదర్శి మినీ దేవి కుమమ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ను ఎస్ టీజెడ్ (స్పెషల్ టెర్రరిస్ట్ జోన్)గా అభివర్ణించారు.

ఇండియాలో తరచూ వినిపించే ఎస్ఈజెడ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ను తలపించేలా ఆమె ప్రసంగించడం ఆకర్షించింది. పాకిస్థాన్ లో ప్రత్యేక టెర్రరిస్టు జోన్ లు ఎన్నో ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని తాము ఎంతగా డిమాండ్ చేస్తున్నా ఆ దేశం స్పందించడం లేదని ఆరోపించారు. పాక్ లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిజమైన సమస్య పాకిస్థాన్ ఉగ్రవాదమేనని ఎస్ టీజెడ్ లను నడుపుతున్న పాకిస్థాన్ తమను విమర్శించడం ఏంటని ఆమె నిలదీశారు.

  • Loading...

More Telugu News