madras high court: వీఐపీల పేరుతో ట్రాఫిక్ పది నిమిషాలకు మించి ఆపొద్దు: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • వీఐపీల పేరుతో గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపేయొద్దు
  • గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా ఒకటే
  • రాష్ట్రపతి, ప్రధానికి మినహాయింపు

ట్రాఫిక్ నిలిపివేతపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది మార్చి 22న హైకోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ ను నిలిపేశారని, దాని వల్ల తాను అపాయింట్ మెంట్ తీసుకున్న సమయానికి డాక్టర్ ను కలవలేకపోయానని, దీనిపై నగర ట్రాఫిక్ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయవాది ఎస్. దొరైస్వామి వేసిన పిల్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం పలు మార్గదర్శకాలను సూచించింది.

 జరిగిన ఘటనలో ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేయడమే పిటిషనర్ ఉద్దేశమని చెబుతూ, వీఐపీలు వెళ్తున్నారంటూ ట్రాఫిక్‌ ను ఐదు నుంచి పది నిమిషాలకంటే ఎక్కువ సేపు నిలిపివేయొద్దని సూచించింది. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి లేక ఇతరులు ఎవరికోసమైనా ట్రాఫిక్‌ ను అంతసేపు నిలిపివేయరాదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ప్రధానిల పర్యటనలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. 

madras high court
chenni
Tamilnadu
  • Loading...

More Telugu News