mahammad shami: నేను ఫిక్సింగ్ చేయలేదు...నా భార్య ఆరోపణలు అవాస్తవం: షమీ

  • నేను ఫిక్సింగ్ చేయలేదు
  • పాకిస్థాన్ మహిళ నుంచి డబ్బులు స్వీకరించానన్నది నిరూపించాలి
  • దీనిపై సరైన విచారణ జరగాలి

పాకిస్థాన్ మహిళ నుంచి డబ్బులు స్వీకరించానన్న తన భార్య ఆరోపణలను టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఖండించాడు. తాను ఫిక్సింగ్ చేయలేదని, ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని అన్నాడు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశాడు. హసీన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆమెకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తోందని పేర్కొన్నాడు.

తనపై ఆమె చేసిన ఫిక్సింగ్‌ ఆరోపణలు దారుణమని, వాటిని ఆమె నిరూపించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. దీనిపై సరైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. తాను తన భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదని, ఆమె చుట్టూ ఉన్నవాళ్లు చేసిన కుట్ర ఇదని, ఇంత తీవ్రమైన అభియోగాలు ఇప్పుడే ఎందుకు మోపుతోందో తనకు అర్థం కావడం లేదని షమీ పేర్కొన్నాడు. 

mahammad shami
Cricketer
team india
marrage contraversy
  • Loading...

More Telugu News