Chandrababu: ప్రధాని మోదీకి రాజీనామా లేఖలు సమర్పించిన అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి

  • మూడున్నరేళ్ల పాటు పౌర విమానాయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు
  • శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సుజనా చౌదరి 
  • కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగిన ఇరువురు నేతలు

ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి తమ రాజీనామా లేఖలను మోదీకి అందజేశారు. అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా సుజనా చౌదరి పనిచేసిన విషయం తెలిసిందే. 2014 మే 26న అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2014 నవంబర్ 9న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయమే రాజీనామా లేఖలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్న ఇరువురు నేతలు... మోదీ అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యంగా రాజీనామా లేఖలను సమర్పించారు. 

Chandrababu
Narendra Modi
Sujana Chowdary
  • Loading...

More Telugu News