rajanikanth: ఇకపై రజనీ ట్విట్టర్ ఖాతా ‘@రజనీకాంత్’

  • తన ట్విట్టర్ ఖాతాలో కీలక మార్పు చేసిన రజనీ
  • ‘@సూపర్ స్టార్ రజనీకాంత్’ లో సూపర్ స్టార్ ని తొలగించిన రజనీ
  • సూపర్ స్టార్ లేకపోవడం వెలితిగా ఉందంటున్న అభిమానులు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో కీలక మార్పు చేశారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి ‘సూపర్ స్టార్’ అనే బిరుదును ఆయన తొలగించారు. లక్షలాది అభిమానులకు ఆరాధ్యదైవంగా ఉన్న రజనీకాంత్ ఆ బిరుదును తొలగించడం చాలా వెలితిగా ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో నిరాడంబరంగా ఉండే రజనీ, తన బిరుదును ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు. దీంతో ‘@సూపర్ స్టార్ రజనీకాంత్’ కాస్తా ‘@రజనీకాంత్’గా ఆయన ట్విట్టర్ ఖాతా మారింది. కాగా, 2013లో రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 

rajanikanth
twitter
  • Loading...

More Telugu News