Chandrababu: కీలక పరిణామం.. చంద్రబాబుకి ప్రధాని మోదీ ఫోన్‌!

  • తాజా రాజకీయ పరిణామాలపై 10 నిమిషాలు ఫోన్‌ లో చర్చ
  • రాజస్థాన్ పర్యటన నుంచి ఢిల్లీకి వచ్చిన వెంటనే మోదీ ఫోన్‌
  • కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రుల ఉపసంహరణకు కారణాలను వివరించిన చంద్రబాబు

టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ప్రధాని అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నారు. కాసేపట్లో వారు మోదీని కలవాల్సి ఉండగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని ఫోన్ చేశారు.

తాజా రాజకీయ పరిణామాలపై 10 నిమిషాల పాటు చంద్రబాబుతో మోదీ మాట్లాడారు. రాజస్థాన్ పర్యటన నుంచి ఢిల్లీకి వచ్చిన వెంటనే మోదీ.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రుల ఉపసంహరణకు సంబంధించిన కారణాలను మోదీకి చంద్రబాబు వివరించారు. మోదీ, చంద్రబాబుకి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Chandrababu
Narendra Modi
Union Budget 2018-19
Special Category Status
  • Loading...

More Telugu News