Narendra Modi: కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల డిమాండ్
  • మోదీ అపాయింట్ మెంట్ తీసుకున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి 
  • ఢిల్లీలో టీడీపీ ఎంపీల ఆందోళన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని, విభజన హామీలను అమలు చేయాలని కోరుతోన్న టీడీపీ నేత‌ల డిమాండ్ల‌పై నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మ‌రోసారి నీళ్లు చ‌ల్లిన విషయం తెలిసిందే. దీంతో త‌మ పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడి ఆదేశాల మేర‌కు త‌మ కేంద్ర మంత్రి ప‌దవుల‌కు రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రి రాజీనామా లేఖ‌లు సిద్ధం చేసుకున్నారు.

ఇప్ప‌టికే వారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. కాసేప‌ట్లో వారు మోదీని క‌ల‌వ‌నున్నారు. మ‌రోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో త‌మ నిర‌స‌న‌ల‌ను ఉద్ధృతం చేస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ అమ‌లుతో పాటు విశాఖ‌కి రైల్వేజోన్ ప్ర‌క‌టించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

Narendra Modi
ashok gajapati raju
Sujana Chowdary
  • Loading...

More Telugu News