kcr: కేసీఆర్ పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఫిర్యాదు

  • మోదీపై కేసీఆర్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
  • కఠిన చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
  • ఫిర్యాదు చేసిన రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు

ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఎంఏ అబ్బాసీ ఫిర్యాదులో కోరారు. హైదరాబాదులోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. తనతో పాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలందరూ కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారని చెప్పారు.

kcr
Narendra Modi
comments
police
complaint
  • Loading...

More Telugu News