WOMENS DAY: బేగంపేట రైల్వేస్టేషన్‌లో టికెట్ల జారీ నుంచి తనిఖీలు, భద్రత వరకు మహిళా ఉద్యోగులే!

  • మహిళా రైల్వే స్టేషన్‌గా బేగంపేట రైల్వే స్టేషన్‌
  • 27 మంది మహిళా ఉద్యోగుల విధులు
  • బేగంపేట రైల్వే స్టేషన్‌ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం వీకే యాదవ్

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం వీకే యాదవ్ హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించి, సదరు రైల్వే స్టేషన్‌ను మహిళా రైల్వే స్టేషన్‌గా ప్రకటించారు. అలాగే, గుంటూరు డివిజన్‌లోని ఫిరంగిపురం రైల్వే స్టేషన్‌తో పాటు విజయవాడ డివిజన్‌లోని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌ను కూడా కొన్ని రోజుల్లో మహిళా రైల్వే స్టేషన్లుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో 27 మంది మహిళా ఉద్యోగులను నియమించామని, టికెట్ల జారీ నుంచి తనిఖీలు, భద్రత, పారిశుద్ధ్యం వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. రైల్వేల్లో రాణిస్తోన్న మహిళలను ఆయన అభినందించారు.

WOMENS DAY
jobs
railway
Hyderabad
  • Loading...

More Telugu News