somireddy chandramohan reddy: మంత్రి సోమిరెడ్డి గెటప్ ను మెచ్చుకున్న చంద్రబాబు

  • పంచె, కండువాతో అసెంబ్లీకి వచ్చిన సోమిరెడ్డి
  • వేషధారణను మెచ్చుకున్న చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
  • రైతు గెటప్ లో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సోమిరెడ్డి

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పక్కా రైతులా... పంచె, కండువా ధరించి సభకు వచ్చారు. రైతు వేషధారణతో అసెంబ్లీకి వచ్చిన సోమిరెడ్డికి అసెంబ్లీ లాబీలో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత వారితో కలసి ఆయన సీఎం ఛాంబర్ కు వెళ్లారు. సోమిరెడ్డి వేషధారణ చంద్రబాబును కూడా బాగా ఆకట్టుకుంది. గెటప్ బాగుందంటూ ఆయనను చంద్రబాబు అభినందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ కూడా సోమిరెడ్డిని అభినందించారు. 

somireddy chandramohan reddy
farmer getup
Chandrababu
  • Loading...

More Telugu News