mohan babu: సెంటిమెంట్ అంటూ తీసిపారేస్తారా?: ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీపై మోహన్ బాబు ఫైర్

  • ఏపీ ఏం అన్యాయం చేసింది?
  • సవతి తల్లి ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు?
  • ఏపీకి హోదా ఇవ్వాలని తెలంగాణ కూడా కోరుకుంటోంది

ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. జైట్లీని ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలను సంధించారు. 'ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు? ఏపీ చేసిన అన్యాయం ఏమిటి? స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం జరుగుతోంది? తెలంగాణ కూడా ఏపీకి ప్రత్యేక హోదాను కోరుకుంటోంది. మీరు మాత్రం హోదా అనేది ఒక రాష్ట్ర (ఏపీ) సెంటిమెంట్ అంటూ తీసిపారేస్తారా?' అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మోహన్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

mohan babu
tweet
Arun Jaitly
Special Category Status
  • Error fetching data: Network response was not ok

More Telugu News