Indian Coast Guard: లక్ష ద్వీప్ కి సమీపంలో మంటల్లో చిక్కుకున్న భారీ నౌక

  • అరేబియా సముద్రంలో నౌకలో మంటలు
  • డెన్మార్క్‌ లోని మెర్‌ స్క్ కంపెనీకి చెందిన భారీ వాణిజ్య నౌక
  • రెండు రోజులుగా అదుపులోకి రాని మంటలు

 లక్ష ద్వీప్ కి సమీపంలోని అరేబియా సముద్రంలో భారీ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుకుంది. డెన్మార్క్‌ లోని మెర్‌ స్క్ కంపెనీకి చెందిన భారీ వాణిజ్య నౌకకు భారత సముద్ర జలాల్లో మంటలంటుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి చెలరేగిన మంటలు రెండురోజులు గడుస్తున్నా అదుపులోకి రాలేదని సమాచారం అందిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో నౌకలోని 27 మంది సిబ్బందిలో 22 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే సిబ్బందిలో థాయ్ లాండ్ కు చెందిన ఒకరు మరణించినట్టు సమాచారం అందిందని తెలిపారు. మరో నలుగురు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు చెప్పారు. ప్రమాదానికి కారణం, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉందని కోస్ట్ గార్డ్ తెలిపింది. 

Indian Coast Guard
Indian navy
burning MAERSK HONAM
  • Loading...

More Telugu News