KTR: బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు: కేటీఆర్

  • ఈ దేశం అంటే రెండు పార్టీలే కాదు
  • బలమైన ప్రాంతీయ పార్టీ వ్యవస్థ ఉంది
  • మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది

కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు ఒంటెత్తు పోకడలతో విసిగిపోయిన మిత్ర పక్షం టీడీపీ కేంద్రంలో తన మంత్రి పదవులను వదులుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ చానల్ తో ఈ రోజు మాట్లాడారు. ఈ దేశం కేవలం రెండు పార్టీల కోసమే కాదన్నారు. భారత్ లో బలమైన ప్రాంతీయ పార్టీ వ్యవస్థ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా తమ రాష్ట్రానికి కూడా తిరస్కరించారంటూ బిహార్ సీఎం నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం, శివసేన ఎన్డీయేకు లోగడే గుడ్ బై చెప్పడం, తెలంగాణలో సీఎం కేసీఆర్ సైతం మోదీ సర్కారు తీరును ఎండగట్టడం ఇవన్నీ మోదీ ప్రాభవానికి బీటలు పడుతున్న సంకేతాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

KTR
Telugudesam bjp split
  • Loading...

More Telugu News