redmi: దూకుడు మీదున్న షియోమీ... ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ విడుదల
- రెడ్ మీ 5 ఆవిష్కరించే అవకాశం
- ఇందులో 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
- ఇప్పటికే 5ఏ, నోట్5, 5ప్రో విడుదల
చైనాకు చెందిన షియోమీ భారత మార్కెట్లో ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతోంది. దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇన్నాళ్లూ శామ్ సంగ్ అగ్రస్థానంలో ఉండగా, షియోమీ ఇటీవలే దాన్ని కొల్లగొట్టింది. ఇటీవలి కాలంలో కంపెనీ రెడ్ మీ నోట్ 5, 5 ప్రోలను ఆవిష్కరించగా కొన్ని నెలల క్రితమే రెడ్ మీ 5ఏ మోడల్ ను కూడా ఆవిష్కరించింది. నెల వ్యవధిలోనే ఇప్పటి వరకు రెండు టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇదే దూకుడుతో ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది. అది ఏంటన్నది కంపెనీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు. కాకపోతే అది రెడ్ మీ 5 కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెడ్ మీ 4కు తదుపరి జనరేషన్ మోడల్ 5గా రానుంది. 4ఏ మోడల్ స్థానంలో 5ఏను తీసుకురాగా, రెడ్ మీ 4, 2017 మోడల్ కు సమాంతరంగా మరో స్మార్ట్ ఫోన్ ను ఇంకా విడుదల చేయలేదు. కనుక ఈ నెల 14న ఆవిష్కరించే మోడల్ అదేనని భావిస్తున్నారు. రెడ్ మీ 5 మోడల్ లో 5.7 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 వెర్షన్ ఓఎస్, ఎంఐయూఐ 9, 2జీబీ, 3జీబీ ర్యామ్, 16జీబీ, 32జీబీ వెర్షన్లతో ఈ మోడల్ ను కంపెనీ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇంకా 12 మెగా పిక్సల్స్ రియర్ కెమెరా, ఎల్ఈ డీ ఫ్లాష్, ముందు భాగంలో 5మెగా పిక్సల్స్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.