parliament: వైసీపీ ఎంపీలపైకి దూసుకెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి... పార్లమెంట్ ప్రాంగణంలో కలకలం!

  • పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న వైకాపా సభ్యులు
  • దూసుకువెళ్లి సవాల్ విసిరిన జేసీ
  • మీసం మెలేస్తూ, రాజీనామాలకు కదలాలని డిమాండ్
  • అందరమూ కలసి చేద్దామన్న వైకాపా ఎంపీలు

ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపైకి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దూసుకెళ్లడంతో కొంత కలకలం రేగింది. పార్లమెంట్ గేట్ ముందు నిలబడి ఉన్న వైసీపీ ఎంపీల ముందుకు వెళ్లిన జేసి, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగి, దమ్ముంటే వెంటనే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో, అక్కడున్న వైకాపా ఎంపీలు 'మీకు ఆ దమ్ము లేదా?' అని ప్రశ్నించడంతో, జేసీ తీవ్ర ఆగ్రహంతో వారిపైకి వెళ్లి, వాళ్లను అక్కడి నుంచి లాగే ప్రయత్నం చేశారు. తన మీసం మెలేస్తూ, మూతి మీద మీసం ఉంటే ఇప్పుడే రాజీనామాలకు కదలాలని డిమాండ్ చేశారు. ఆపై వైకాపా ఎంపీలు మాట్లాడుతూ, జేసీ దివాకర్ రెడ్డి సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని, అందరూ కలసి కట్టుగా నేడే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేద్దామంటే తాము అంగీకరిస్తామని స్పష్టం చేయడం గమనార్హం.

parliament
YSRCP
Telugudesam
JC Diwakar Reddy
  • Loading...

More Telugu News