vishnukumar raju: చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం తీసుకున్న నిర్ణయమిది: విష్ణుకుమార్ రాజు

  • ఏపీకి హోదా ద్వారా వచ్చే నిధులను వేరే రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పింది
  • ప్రజల సెంటిమెంట్ గుర్తిస్తాము కానీ రాజకీయాల కోసం వాడుకోము
  • హోదా, సెంటిమెంట్ పేరు చెప్పి కేబినెట్ నుంచి వైదొలగడం సరికాదు

 రాజకీయ మైలేజీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌ రాజు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా గాలి వీస్తోందని, అందుకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారని అన్నారు. అయితే, ఏపీకి హోదా ద్వారా వచ్చే నిధులను వేరే రూపంలో ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన చెప్పారు. తాము ప్రజల సెంటిమెంట్ ను గుర్తిస్తాము కానీ, రాజకీయాలకు వాడుకోమని అన్నారు.

హోదా, ప్రజల సెంటిమెంట్ పేరు చెప్పి బాబు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగడం సరికాదని ఆయన హితవు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వంలో లేకపోయినా రాష్ట్రం కోసమే ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. పది సంవత్సరాల్లో ఇస్తామన్న వాటిలో 85 శాతాన్ని బీజేపీ మూడున్నరేళ్లలో ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారనడం సరికాదని ఆయన సూచించారు. 

vishnukumar raju
bjp
Andhra Pradesh
  • Loading...

More Telugu News