Andhra Pradesh: చంద్రబాబువి పచ్చి అబద్ధాలు... సాక్ష్యాలతో సహా నిరూపిస్తా: విష్ణుకుమార్ రాజు

  • ఏపీకి నిధుల విషయంలో అబద్ధాలు
  • డీపీఆర్ లు సమర్పించని సర్కారు
  • అందువల్లే నిధుల మంజూరు ఆలస్యం
  • ఎందుకంత రహస్యమని అడిగిన విష్ణుకుమార్ రాజు

కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ విషయాన్ని తాను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. ఈ ఉదయం బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టిన తీరు గురించి పూర్తి లెక్కలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం అసత్యమని ఆయన ఆరోపించారు.

అంచనా వ్యయాలు, పోలవరం ప్రాజెక్టుకు అవుతున్న ఖర్చు, రెవెన్యూ లోటు తదితరాంశాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రహస్యంగా దాస్తోందని ప్రశ్నించిన ఆయన, అతి త్వరలో కేంద్రానికి అందిన డీపీఆర్, ఎల్ పీల గురించి కేంద్రానికి అందిన అన్ని పత్రాలనూ త్వరలోనే తీసుకొచ్చి నిజానిజాలను వెల్లడిస్తానని తెలిపారు. డీపీఆర్ లు కేంద్రానికి అందడం లేదు కాబట్టే నిధుల విడుదల ఆలస్యం అవుతోందని, అందుకు ప్రభుత్వమే కారణమని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

Andhra Pradesh
Chandrababu
Vishnukumar Raju
  • Loading...

More Telugu News