Paidikondala Manikyalarao: అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేసిన మంత్రులు కామినేని, పైడికొండల
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-51ccf493d76d02f0eea7e0be6f9d181dfd6dc807.jpg)
- బీజేపీ పెద్దలతో మాట్లాడిన పైడికొండల మాణిక్యాలరావు
- ఈ ఉదయం క్యాబినెట్ సమావేశానికీ గైర్హాజరు
- వాహనం, ఐడీ కార్డుల సరెండర్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇప్పటివరకూ భాగంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. గత రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకోగా, ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
![](https://img.ap7am.com/froala-uploads/froala-cea96c73584b4ad5ecd6361949e3bf07052dc2b4.jpg)