Kamineni Srinivas: టీడీపీ నిర్ణయంతో రాష్ట్రాభివృద్ధికి విఘాతం... బీజేపీలోనే కొనసాగుతా!: మంత్రి కామినేని

  • నేడు స్పీకర్‌కు బీజేపీ మంత్రుల రాజీనామా లేఖలు
  • ఐదు నిమిషాల సమయం కోరినట్టు చెప్పిన కామినేని
  • టీడీపీ నిర్ణయం తర్వాతే తామీ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి

కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలన్న టీడీపీ నిర్ణయంతో రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నిర్ణయంతో తాము కూడా ఏపీ కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నేడు తమ పదవులకు రాజీనామా చేస్తామని, స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందజేస్తామని పేర్కొన్నారు. రాజీనామాలకు గల కారణాలను చెప్పేందుకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. రాజీనామాలపై టీడీపీ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

విభజన హామీలు నెరవేర్చాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న టీడీపీ బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీతో దాదాపు నాలుగేళ్లుగా కొనసాగిస్తున్న పొత్తును తెంచుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా నేడు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు‌, సుజనా చౌదరి తమ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.

Kamineni Srinivas
Telugudesam
BJP
Special Category Status
  • Loading...

More Telugu News