Mohammed Shami: బీసీసీఐ సంచలన నిర్ణయం.. మహమ్మద్ షమీపై వేటు

  • షమీ భార్య ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ
  • షమీ వివరణపై సంతృప్తి చెందని బోర్డు
  • ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి షమీ పేరు తొలగింపు

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బౌలర్ మహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ షమీపై వేటు వేసింది. ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో షమీని కొనసాగిస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనతో అతడి పేరును తొలగించింది. టీమిండియా ఆటగాళ్ల వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించిన బీసీసీఐ ఆ జాబితా నుంచి షమీ పేరును తొలగించింది.

షమీకి తనతో వివాహానికి ముందే ఎంతోమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళతో వివాహం కూడా జరిగిందంటూ హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. భార్య ఆరోపణలపై స్పందించిన షమీ వాటిని కొట్టి పడేశాడు. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని వివరణ ఇచ్చాడు. షమీ వివరణ ఇచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం సంతృప్తి చెందలేదు. ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి అతడిని పక్కకు తప్పించింది.

Mohammed Shami
extramarital affair
BCCI
  • Loading...

More Telugu News