CPI Narayana: ఏపీని మోసం చేసిన బీజేపీ అంతకు అంతా అనుభవిస్తుంది.. సీపీఐ నారాయణ హెచ్చరిక

  • చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
  • ఏపీకి బీజేపీ మొండిచేయి చూపింది 
  • మోసానికి ప్రతిఫలం అనుభవిస్తుంది

కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు సీపీఐ నేత నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేస్తున్న మోసాన్ని చంద్రబాబు ఇన్నాళ్లకు గుర్తించారన్నారు. మంత్రి పదవులకు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్లుగా ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఆరోపించారు. ఏపీకి చేసిన మోసానికి ప్రతిగా బీజేపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పునరుద్ఘాటించారు.

CPI Narayana
Andhra Pradesh
BJP
Special Category Status
  • Loading...

More Telugu News