Vishnukumar raju: టీడీపీ దారిలోనే బీజేపీ కూడా... కామినేని, పైడికొండల రాజీనామా

  • కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న టీడీపీ
  • ఆ వెంటనే రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న బీజేపీ
  • రాత్రి 11.30 గంటల సమయంలో మీడియాకు వెల్లడి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్రమంత్రి పదవులకు గురువారం ఉదయం రాజీనామాలు సమర్పించనున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించిన నిమిషాల తరువాత నవ్యాంధ్ర రాజకీయం శరవేగంగా మారిపోయింది. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో సమావేశమైన బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావులు రాజీనామా చేయనున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు వెల్లడించారు. ఈ విషయాన్ని రాత్రి 11.30 గంటల సమయంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన వెల్లడించారు. చంద్రబాబునాయుడు గతంలో కూడా ఇదే విధమైన మోసం చేశారని, ఆపై పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారని విమర్శించారు. బాబు ఈ నిర్ణయం తీసుకుంటారన్న విషయం తమకు ముందుగానే తెలుసునని చెప్పారు.

Vishnukumar raju
BJP
  • Loading...

More Telugu News