Nara Lokesh: కేంద్రం తీరుపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

  • నాలుగేళ్లుగా కేంద్రం ఇస్తున్న బూటకపు హామీలను నమ్మాం
  • ఇక మా వల్ల కాదు.. వేచి చూడలేం
  • కేంద్రం తీరుపై లోకేశ్ అసహనం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంత్రి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా కేంద్రం చెబుతున్న మాటలను, ఇస్తున్న బూటకపు హామీలను నమ్ముతూ వచ్చామన్నారు. ఇప్పటి వరకు వేచి చూసింది చాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులు వైదొలుగుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎంత వరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు.  

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న తీరును జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుందామని తెగేసి చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం చంద్రబాబు కూడా అదే నిర్ణయానికి రావడంతో బుధవారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నుంచి తాము వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు. నేడు కేంద్ర మంత్రులు  సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు.

  • Loading...

More Telugu News