central government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు!

  • కేంద్ర ఉద్యోగులు, పింఛన్ దారులకు 2 శాతం డీఏ పెంపు
  • ఈ ఏడాది జనవరి 1 నుంచి  పెరిగిన డీఏ అమల్లోకి
  • డీఏ పెంపు నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల భారం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (డియర్ నెస్ అలవెన్స్) ని రెండు శాతం పెంచింది, ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ పింఛన్ దారులకు కూడా డీఏ ను 2 శాతం పెంచేందుకు ఆమోదించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది.

 కాగా, డీఏ పెంపు నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల భారం పడనుండగా, 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61.17 లక్షల మంది పింఛన్ దారులకు లబ్ధి చేకూరనుంది. 

central government
da
  • Loading...

More Telugu News