Chandrababu: జైట్లీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసంతృప్తి.. కాసేపట్లో మీడియా ముందుకు.. కీలక ప్రకటన?

  • ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ జైట్లీ వ్యాఖ్యలు
  • బీజేపీతో తమ పార్టీ ఇకపై కొనసాగే అంశంపై చంద్రబాబు ప్రకటన?
  • జైట్లీ వ్యాఖ్యలపై మండిపడుతోన్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిధుల విషయంలో సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని కూడా జైట్లీ అన్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జైట్లీ చేసిన వ్యాఖ్యలపై, తాము కేంద్ర ప్రభుత్వంతో ఇకపై పోరాడే తీరుపై వివరించడానికి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బీజేపీతో తమ పార్టీ మిత్రత్వం కొనసాగించే అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర టీడీపీ నేతలు జైట్లీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

Chandrababu
Andhra Pradesh
Telugudesam
Arun Jaitly
  • Loading...

More Telugu News