kcr: ఏప్రిల్ 29న యాదవ, కురుమలతో భారీ బహిరంగ సభ : మంత్రి తలసాని

  • యాదవ, కురుమ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించిన తలసాని
  • సభకు గొల్ల, కురుమలు తరలి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం
  • ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరుకానున్నారు : తలసాని

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యాదవ, కురుమలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. యాదవ, కురుమ ముఖ్యనాయకులతో సచివాలయంలోని తన చాంబర్ లో ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ, ఏప్రిల్ 29 వ తేదీన సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో పది లక్షల మంది యాదవ, కురుమలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ బహిరంగసభకు ప్రతి గ్రామం నుండి గొల్ల, కురుమలు తరలి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో గొల్ల, కురుమ నాయకులతో ఉమ్మడి జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమన్వయ కమిటీల సభ్యులు ఈ నెల 11 వ తేదీ నుండి జిల్లాల్లో పర్యటిస్తారని,  జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఈ బహిరంగసభ ఉద్దేశాన్ని వివరించి చెబుతారని అన్నారు. బహిరంగ సభ గురించి వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలలో గొల్ల, కురుమల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. 

  • Loading...

More Telugu News