Pawan Kalyan: పవన్ కల్యాణ్ అత్తగారు ఆరోగ్యంగానే ఉన్నారు!: పుకార్లపై పవన్ మీడియా ప్రతినిధి వివరణ

  • పవన్ భార్య లెజ్నోవా తల్లి మరణించారంటూ ప్రచారం
  • భార్యకు తోడుగా, కార్యకలాపాలకు దూరంగా పవన్ అంటూ పుకార్లు
  • ఈ వార్తలను ఖండించిన పవన్ ప్రతినిధి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శోకసంద్రంలో ఉన్నారనే వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. పవన్ భార్య అన్నా లెజ్నోవా తల్లి మరణించారని... ఈ నేపథ్యంలో, తన కార్యకలాపాలన్నింటినీ పక్కనపెట్టి, భార్యకు బాసటగా ఆయన ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అన్నా లెజ్నోవా, పవన్ లకు రేణుదేశాయ్ సానుభూతి తెలిపారని కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో, ఈరోజు పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. తన రాజకీయ కార్యాచరణపై మాట్లాడారు.

మరోవైపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పవన్ మీడియా ప్రతినిధి ఖండించారు. అన్నా లెజ్నోవా తల్లి ఆరోగ్యంగా ఉన్నారని... ఆమె చనిపోయిందన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేయవద్దని కోరారు. 

Pawan Kalyan
wife
anna leznova
mother
dead
Social Media
  • Loading...

More Telugu News