stock markets: మార్కెట్లపై ట్రంప్ ప్రభావం.. వరుసగా ఆరో రోజు కూడా నష్టాలే!
- ట్రేడ్ వార్ కు ట్రంప్ సిద్ధమవుతున్నారనే వార్తలతో మార్కెట్లు కుదేలు
- 284 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 95 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ట్రేడ్ వార్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారనే వార్తలతో అంతర్జాతీయంగా మార్కెట్లు కుదేలయ్యాయి. వీటి ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. ఫలితంగా వరుసగా ఆరో రోజు కూడా మన మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ స్టాకులు నష్టాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 33,033కు పడిపోయింది. నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 10,154కు జారిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వక్రాంగీ (4.39%), సెంట్రల్ బ్యాంక్ (3.93%), ఐపీసీఏ లేబొరేటరీస్ (2.65%), హెక్సావేర్ టెక్నాలజీస్ (2.49%), నెట్ వర్క్ 18 (2.29%).
టాప్ లూజర్స్:
ఫోర్టిస్ హెల్త్ కేర్ (-8.56%), జైప్రకాశ్ అసోసియేట్స్ (-8.36%), కర్ణాటక బ్యాంక్ (-8.17%), ఆంధ్ర బ్యాంక్ (-7.74%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (-7.67%)