US President Trump: ట్రంప్‌పై న్యాయపోరాటానికి దిగిన పోర్న్ స్టార్!

  • అమెరికా అధ్యక్షుడిపై లాస్‌ఏంజిల్స్ కోర్టులో శృంగార తార దావా
  • ఒప్పందంపై తనతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపణ
  • ఏడాది పాటు ట్రంప్‌తో ఎఫైర్ సాగిందని వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మెడకు కోర్టు చిక్కులు చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ ఆయనపై లాస్‌ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేసింది. ఆయనతో తనకున్న సంబంధాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు 2016లో ఆయన తరపు న్యాయవాది సంబంధిత ఒప్పందంపై తనతో బలవంతంగా సంతకం చేయించారని, దానిపై ట్రంప్ సంతకం చేయలేదని, అందువల్ల అది చెల్లదని ఆమె అంటోంది. ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ తనకు 1,30,000 డాలర్లు చెల్లించారని ఆమె తన దావాలో పేర్కొంది. 2006 నుంచి 2007 వరకు ఏడాది పాటు ట్రంప్‌కి, తనకి మధ్య ఎఫైర్ కొనసాగిందని స్టోర్మీ చెబుతోంది.

బేవర్లీ హిల్స్ హోటల్ వద్ద ట్రంప్ బంగ్లాలో ఓసారి ఆయన్ను కలిశానని ఆమె తెలిపింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా అక్టోబరు 28, 2016న ఒప్పందంపై స్టోర్మీ, ట్రంప్ న్యాయవాది కోహెన్ సంతకాలు చేశారని ఆమె తరపు న్యాయవాది మైఖేల్ అవెనట్టి ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రంప్‌ని కాపాడేందుకే స్టోర్మీని నోరు మెదపకుండా ఒత్తిడి చేస్తున్నారని దావాలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేస్తుండటం గమనార్హం. స్టోర్మీతో ఒప్పందంలో భాగంగా ఆమెకు తన జేబు నుంచి 130000 డాలర్లను చెల్లించినట్లు ట్రంప్ తరపు న్యాయవాది కోహెన్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చెల్లింపు వెనుక కారణాలను తెలపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News