kalyan ram: విదేశాల్లో కాజల్ తో కల్యాణ్ రామ్ ఆటా పాట

  • 'ఎమ్మెల్యే'గా కల్యాణ్ రామ్
  • దర్శకుడిగా ఉపేంద్ర మాధవ్ 
  • ఈ నెల 23వ తేదీన భారీ విడుదల             

ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే' .. 'నా నువ్వే' సినిమాలు చేస్తున్నాడు. 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలున్న అబ్బాయ్) అజీర్ భాయ్ జాన్ రాజధాని 'బాకు' నగరంలో షూటింగ్ జరుపుకుంటోంది. కల్యాణ్ రామ్ .. కాజల్ పై అక్కడి అందమైన లొకేషన్స్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. విజువల్స్ పరంగా ఈ పాట ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటుందనేది యూనిట్ సభ్యుల మాట.

మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. సాధారణంగా కల్యాణ్ రామ్ సినిమాల్లో యాక్షన్ ... ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో వాటితో పాటు కామెడీ కూడా కావలసినంత ఉంటుందని అంటున్నారు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, మార్చి 23వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News