Sui dhaga: షూటింగ్ కోసం మండుటెండలో పదిగంటలు సైకిల్‌పై సవారీ చేసిన హీరో!

  • 'సుయ్ ధాగా' చిత్రంలోని ఓ సన్నివేశం కోసం హీరో కష్టం
  • సింపుల్ వస్త్రధారణలో హీరోహీరోయిన్లు
  • మధ్యప్రదేశ్‌లోని ఛండేరిలో షూటింగ్

సీన్ సహజంగా పండేందుకు ఇప్పటి హీరోహీరోయిన్లు బాగానే కష్టపడుతున్నారు. అందుకోసం ఎంత కష్టాన్నైనా వారు ఓర్చుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ఇలాంటి కష్టాన్నే తాజాగా వరుణ్ థావన్ పడ్డాడు. 'సుయ్ ధాగా' చిత్రం కోసం అతను హీరోయిన్ అనుష్క శర్మను సైకిల్‌పై ఎక్కించుకుని మండుటెండను సైతం లెక్కచేయకుండా ఏకంగా పది గంటల సేపు సవారీ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఛందేరిలో ఈ సన్నివేశాన్ని షూట్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ వరుణ్ సైకిల్ సవారీ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ సీన్‌లో హీరోహీరోయిన్లు ఇద్దరూ చాలా సింపుల్ వస్త్రధారణలోనే కనిపిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు అలా సింపుల్‌గా కనిపించాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 'దమ్ లగా కే ఐసా' రచయిత శరత్ కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీశ్ శర్మ నిర్మాత. ఈ చిత్రంలో హీరో టైలర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Sui dhaga
Varun Dhavan
Anushka Sharma
Maneesh Sharma
  • Loading...

More Telugu News