balakrishna': అదంతా పుకారే .. అందులో నిజం లేదు: దర్శకుడు తేజ

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • ఈ నెల 29వ తేదీన షూటింగ్ మొదలు 
  • 72 వేషధారణల్లో కనిపించనున్న బాలకృష్ణ

తేజ దర్శకత్వంలో .. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ పాత్రను శర్వానంద్ చేయనున్నట్టుగా రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయం దర్శకుడు తేజ వరకూ వెళ్లడంతో .. ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఈ పాత్ర కోసం ఇంకా ఎవరినీ అనుకోలేదనీ .. ఆ పాత్ర ఎంపిక జరిగితే వెంటనే ప్రకటిస్తామని అన్నాడు. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ - రామకృష్ణా సినీ స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో 72 వేషధారణలతో బాలకృష్ణ కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.     

  • Loading...

More Telugu News