Priya Prakash: ప్రియా వారియర్ 'కనుగీటు'ను వాడేసుకుంటున్న సీపీఐ!

  • సీపీఐ విద్యార్థి విభాగంగా ఏఐఎస్ఎఫ్
  • కేరళలో జరుగుతున్న మహాసభలు
  • పోస్టర్ లో ప్రియా కనుగీటు చిత్రం
  • ఆమెకు మద్దతు తెలిపేందుకేనన్న విద్యార్థి నేతలు

ఒక్క కనుగీటుతో కోట్లాది మంది యువకుల గుండెల్లో గుబులు పుట్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్, ఇప్పుడు సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) పోస్టర్లపైకి ఎక్కింది. తన హావభావాలతో సోషల్ మీడియాను షేక్ చేసి, ఎంతో మంది హీరోలను, క్రీడాకారులను ఫిదా చేసిన ప్రియా ప్రకాశ్ కనుగీటుతున్న ఫోటోను సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తమ మహాసభల పోస్టర్‌ లో చేర్చింది.

మహాసభల సందర్భంగా విడుదల చేసిన ఆహ్వాన పోస్టర్ లో కేవలం ప్రియ చిత్రం ఒక్కటే ఉండటం గమనార్హం. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌' వివాదాల్లో చిక్కుకుని ఇంకా వెండి తెరను తాకలేదన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రియా ప్రకాశ్ కు, చిత్ర యూనిట్ కు తమ మద్దతు తెలిపేందుకే ఆమె ఫోటోను పోస్టర్ లో చేర్చినట్టు కేరళ ఏఐఎస్ఎఫ్ సంయుక్త కార్యదర్శి జంషీర్‌ తెలిపారు. ఆ పోస్టర్ ను మీరూ చూడవచ్చు.

Priya Prakash
Kerala
AISF
CPI
Poster
  • Loading...

More Telugu News