Goa: కుమారుడు, ప్రత్యేక డాక్టర్ ను వెంటబెట్టుకుని అమెరికాకు వెళ్లిన మనోహర్ పారికర్

  • ముంబై నుంచి అమెరికాకు పయనం
  • క్లోమ సంబంధ వ్యాధికి మెరుగైన చికిత్స కోసమే
  • ఇండియాలో సమస్యకు లభించని పరిష్కారం!

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, మరింత మెరుగైన చికిత్స కోసం ఈ ఉదయం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఓ ప్రత్యేక డాక్టర్ తో పాటు కుమారుడు ఉత్పల్ ఉన్నారు. ముంబై విమానాశ్రయంలో ఆయన అమెరికా విమానం ఎక్కారు.

 కాగా, పారికర్ డీ హైడ్రేషన్, క్లోమ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆయా సమస్యలకు ఇటీవలి కాలంలో ముంబైలోని లీలావతీ ఆసుపత్రిలో రెండు దఫాలు చికిత్స తీసుకున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్లనే అమెరికాకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన అమెరికా పర్యటనపై గోవా గవర్నర్ మృదులా సిన్హాకు సమాచారాన్ని ఇచ్చిన ఆయన, తాను నియమించిన మంత్రి మండలి రాష్ట్ర పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Goa
CM
Manohar Parikar
Utpal
  • Loading...

More Telugu News