Rohit Sharma: మరో చెత్త రికార్డును నమోదు చేసిన టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ!

  • అత్యధిక సార్లు డకౌట్లు అయిన భారత ఆటగాడిగా రోహిత్
  • అంతర్జాతీయ మ్యాచుల్లో 12 సార్లు, టీ 20ల్లో 5 సార్లు
  • కొనసాగుతున్న రోహిత్ పేలవ ఫామ్

టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ గత ఐదేళ్లలో అత్యధిక డకౌట్‌లు అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. మార్చి 6, 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 12 సార్లు డకౌట్ అయ్యాడు.

ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రికార్డును సమం చేశాడు. 11 డక్‌లతో  పేసర్ భువనేశ్వర్ కుమార్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీ20ల్లో రోహిత్‌కు ఇది ఐదో డకౌట్. 68 టీ20 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 5 సార్లు డకౌట్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మూడేసి డక్‌లతో ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్‌లు కొనసాగుతున్నారు.

Rohit Sharma
Sri Lanka
Nidahas Trophy
Ducks
  • Loading...

More Telugu News