Pakistan: పాకిస్థాన్ లో ఇక స్టయిల్ గా గడ్డం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం కుదరదు!
- పాకిస్థాన్లోని పెషావర్లో ఓ కొత్త రూల్
- ఇష్టం వచ్చిన తీరులోనే హెయిర్ కటింగ్ చేయాలని ఎవ్వరూ కోరకూడదని ఆర్డర్
- పత్రికా ప్రకటనలు కూడా చేసిన వైనం
పాకిస్థాన్లోని పెషావర్లో ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. యువకులు స్టైల్ గా చేయించుకునే గడ్డం, హెయిర్ కటింగులను ఇక అక్కడ చేయబోరు. తాము ఇస్లాం సంప్రదాయ గడ్డాలను, హెయిర్ స్టయిల్స్ ను మాత్రమే చేస్తామని అక్కడి బార్బర్ లు చెప్పేస్తున్నారు. ఈ విషయం గురించి అందరికీ తెలియాలని బార్బర్ల సంఘాలు ఓ తీర్మానం కూడా చేసి పత్రికా ప్రకటనలు ఇచ్చాయి.
తమకు ఇష్టం వచ్చిన తీరులోనే హెయిర్ కటింగ్ చేయాలని ఎవ్వరూ కోరకూడదని తెలిపాయి. పెషావర్ లో గతంలో తాలిబన్లు దాడులు జరిపి, ఇస్లాం సంప్రదాయబద్ధంగానే కటింగులు చేయించుకోవాలని బెదిరించేవారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో అటువంటి దాడులు లేకపోయినప్పటికీ బార్బర్ లే స్వయంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.