Special Category Status: ప్రత్యేక హోదా లేదు.. రాయితీలు లేవు: ఏపీకి షాకిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ‌

  • ఈ రోజు 'తెలుగువారి సెంటిమెంట్' అంటున్నారు
  • రేపు తమిళ, మలయాళం వారి సెంటిమెంట్ అంటారు
  • ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయికి కూడా లెక్కలు చెప్పలేదు
  • కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు తమకెందుకు ఇవ్వరని అడగడంలో అర్థం లేదు

ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది. పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు సతమతం అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేసింది.

 ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది. అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా, ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయికి కూడా లెక్కలు చెప్పలేదని తెలిపింది. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హోదా తమకెందుకు ఇవ్వరని అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించింది.

Special Category Status
Andhra Pradesh
Arun Jaitly
  • Loading...

More Telugu News