Kajra Re: పెళ్లి వేడుకలో 'కజరా రే' పాటకు కోహ్లీ స్టెప్పులు...వీడియో వైరల్

  • స్నేహితుడి పెళ్లి వేడుకలో కోహ్లీ చిందులు
  • బంటీ ఔర్ బబ్లీ సినిమాలో పాటకు వరుడితో కలిసి స్టెప్పులు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ మైదానంలో బ్యాట్‌తో దుమ్మురేపడమే కాదు.. అవకాశం దొరికినప్పుడల్లా వివాహ వేడుకల్లో స్టెప్పులతో కూడా ఆకట్టుకుంటుంటాడు. సుదీర్ఘ దక్షిణాఫ్రికా టూర్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్ తనకు దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. శ్రీలంకలో నేటి నుంచి మొదలవుతున్న ట్రై సిరీస్ నుంచి కూడా బీసీసీఐ అతనికి విశ్రాంతినివ్వడంతో ఎక్కువ సమయాన్ని హాయిగా గడపటానికి వెచ్చిస్తున్నాడు.

తాజాగా అతను తన మిత్రుడు గగన్ గుజ్రాల్ పెళ్లి వేడుకకు వెళ్లాడు. భంగ్రా స్టెప్పులతో పాటు అక్కడ పెళ్లికొడుకుతో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలోని 'కజరా రే...' పాటకు స్టెప్పులేశాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. ఇందులో కోహ్లీ అత్తమామలు కూడా కనిపిస్తారు. సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల తన భార్య అనుష్క శర్మ ఈ వేడుకకు హాజరుకాలేదని వారి సన్నిహితులు చెబుతున్నారు.


  • Error fetching data: Network response was not ok

More Telugu News