stock markets: బ్యాంకుల దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు.. 430 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 430 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 110 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఆసియాలోని మార్కెట్లన్నీ పుంజుకున్నప్పటికీ... భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు భారీ నష్టాలను చవి చూశాయి. మార్కెట్లపై బ్యాంకింగ్ సూచీలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 430 పాయింట్లు కోల్పోయి 33,317కి పతనమైంది. నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 10,249కి పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వక్రాంగీ (4.98%), బాంబే డయింగ్ (4.34%), బజాజ్ ఎలక్ట్రికల్స్ (4.10%), కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ (3.79%), భారత్ పెట్రోలియం (2.22%).
టాప్ లూజర్స్:
బీఈఎంఎల్ (-7.53%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-7.49%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-6.75%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-6.46%), రాడికో ఖైతాన్ (-5.94%), సిండికేట్ బ్యాంక్ (-5.05%), ఇండియన్ బ్యాంక్ (-5.02%), కెనరా బ్యాంక్ (-4.40%)