Chandrababu: చంద్రబాబు గాడిద పాలు తెచ్చారా? అనే వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఫైర్

  • చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు
  • మండిపడ్డ బుద్దా వెంకన్న
  • అవాకులు, చెవాకులు పేలవద్దంటూ హెచ్చరిక

అమరావతి కోసం ఢిల్లీ నుంచి చెంబు నీళ్లను నరేంద్రమోదీ తెచ్చారంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిద పాలు తెచ్చారా? అంటూ ఆయన దెప్పి పొడిచారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు గురించి అవాకులు, చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. సోము వీర్రాజు నోటిని అదుపులో పెట్టుకోవాలని... లేకపోతే ఆయనకే మంచిది కాదని అన్నారు. బీజేపీ నేతలు తీరును మార్చుకోకపోతే... కనీసం నియోజకవర్గాల్లో తిరిగే ప్రసక్తి కూడా ఉండదని చెప్పారు. ఏపీపై కక్ష కట్టినట్టు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.

Chandrababu
somu veerraju
budda venkanna
Narendra Modi
  • Loading...

More Telugu News