Rajya Sabha: రాజ్యసభలో గందరగోళం... రేపటికి వాయిదా

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై చర్చకు కాంగ్రెస్ సభ్యుల పట్టు
  • తెలుగు దేశం సభ్యుల ఆందోళన, ప్లకార్డుల ప్రదర్శన
  • ప్లకార్డులు ప్రదర్శించవద్దన్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల దేశంలో కలకలం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టు పట్టారు. మరోవైపు ఏపీకి నిధులు, ప్రత్యేక హోదాపై తెలుగు దేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్లకార్డులు ప్రదర్శించవద్దని అన్నారు. గందరగోళం ఎంతకీ తగ్గకపోవడంతో సభ వాయిదా పడింది. 

Rajya Sabha
adjourned
Telugudesam
Special Category Status
  • Loading...

More Telugu News