Rahul Gandhi: విదేశాలకు పయనం కానున్న రాహుల్‌ గాంధీ

  • ఎల్లుండి విదేశాలకు వెళ్లనున్న రాహుల్
  • మూడు రోజుల పాటు సింగపూర్‌, మలేషియాల్లో పర్యటన
  • భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో భేటీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 8 నుంచి ఆయన మూడు రోజుల పాటు సింగపూర్‌, మలేషియాల్లో పర్యటించనున్నారు. సింగపూర్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగం ఉంటుంది. అనంతరం భారత ప్రొఫెషనల్స్‌, సింగపూర్‌ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అవుతారు. సింగపూర్ పర్యటన తరువాత మలేషియాకు వెళ్లి భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో భేటీ అవుతారు.

ఇటీవలే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాహుల్ ఇటీవల ఇటలీలో పర్యటించడంపై విమర్శలు వస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా రాహుల్ మళ్లీ విదేశాలకు పయనమవుతున్నారు.

Rahul Gandhi
India
singapore
  • Loading...

More Telugu News