Sri Lanka: శ్రీలంకలో చెలరేగిన హింస... ఎమర్జెన్సీ విధింపు

  • శ్రీలంకలో మైనార్టీ వర్గీయులపై మెజార్టీ వర్గీయుల దాడులు
  • క్యాండీ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న గొడవలు
  • 10 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

గత కొన్నేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్... ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు.

సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయులపై మెజారిటీ వర్గాలకు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుండటంతో... ప్రభుత్వం అలర్ట్ అయింది. లేట్ అయ్యేకొద్దీ పరిస్థితులు మరింత దిగజారుతాయనే అంచనాలతో ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. 

Sri Lanka
emergency
  • Loading...

More Telugu News