West Side Story: యాభై ఆరేళ్ల తర్వాత అదే డ్రెస్‌తో అలరించిన హాలీవుడ్ ఆస్కార్ నటి...!

  • 1962లో ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ అవార్డ్
  • యాభై ఆరేళ్ల తర్వాత అదే డ్రెస్‌తో సర్‌ప్రైజ్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైనం

కన్నులపండువగా ముగిసిన ఆస్కార్-2018 అవార్డుల ప్రదానోత్సవంలో ఓ ఆకట్టుకునే దృశ్యం ఆవిష్కృతమయింది. అదేంటంటే....హాలీవుడ్ నటి రీటా మోరీనా 1962 నాటి ఆస్కార్ అవార్డుల సందర్భంగా ధరించిన డ్రెస్‌‌నే ఇప్పుడు కూడా ధరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇలా డిఫరెంట్‌గా ప్రయత్నించడం ద్వారా ఆమె స్పెషల్ గుర్తింపు పొందారు. 1962లో ఆమె 'వెస్ట్ సైడ్ స్టోరీ' చిత్రానికి గాను ఉత్త సహాయనటిగా ఆస్కార్‌ను అందుకున్నారు.

ఈ పాతకాలపు డ్రెస్ గురించి రీటా స్వయంగా వివరించారు. ఈ డ్రెస్‌ని ఓ చిల్లంగి బట్టతో తయారు చేశారు. దీనిపై గుండ్రటి ఆకృతిలో పట్టుదట్టీలున్నాయి. సాధారణంగా ఇలాంటి డిజైన్లను జపాన్ మహిళలు తమ కిమినోలపై వాడుతుంటారని ఆమె చెప్పారు. దీనిని తన గదిలో 56ఏళ్ల పాటు వేలాడదీశానని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఈ డ్రెస్‌కు కొద్దిగా మరమ్మత్తులు చేసి తిరిగి ధరించానని ఆమె చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీటా డ్రెస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

West Side Story
Rita Moreno
Hollywood
Oscars 2018
  • Loading...

More Telugu News