stalin: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌లో చేరే అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం: స‌్టాలిన్

  • ఈ విషయంపై మమతా బెనర్జీ ఈ నెల 4న నాకు ఫోన్ చేశారు
  • మేము ప్ర‌స్తుతం యూపీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నాం
  • మూడో ఫ్రంట్‌పై హైలెవల్ కమిటీలో చర్చిస్తాం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఏర్పాటు చేయ‌నున్న థ‌ర్డ్ ఫ్రంట్ లో చేరే అంశంపై తమిళనాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే నేత‌ స్టాలిన్ స్పందించారు. ఈ విషయంపై త‌న‌కు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 4న ఫోన్ చేశార‌ని తెలిపారు. తాము ప్ర‌స్తుతం యూపీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నామని గుర్తు చేసిన ఆయ‌న‌.. మూడో ఫ్రంట్‌పై హైలెవల్ కమిటీలో చర్చించనున్న‌ట్లు తెలిపారు. ఆ త‌రువాత ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. థర్డ్ ఫ్రంట్ విష‌య‌మై కేసీఆర్ దేశంలోని ప‌లువురు అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రప‌నున్న విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News