madhav: టీడీపీ ఎంపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • పార్లమెంటులో జోకర్లలా వ్యవహరిస్తున్నారు
  • మోదీని కించపరుస్తున్నారు
  • మిత్రధర్మం అంటే ఇదేనా?

ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నేతలు రకరకాలుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. టీడీపీ నేతల శైలిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు జోకర్లలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలో మోదీపై తీవ్ర వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. 

madhav
bjp mlc
Telugudesam
BJP
Narendra Modi
  • Loading...

More Telugu News