kavita: రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు: ఎంపీ కవిత

  • రిజర్వేషన్లు పెంచొద్దని రాజ్యాంగం చెప్పలేదు
  • ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది
  • అవసరమైతే 50 శాతం మించి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది

రిజర్వేషన్లు 50 శాతం మించరాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, రిజర్వేషన్లను పెంచొద్దని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని, ఒక తీర్పులో సుప్రీంకోర్టు మాత్రమే చెప్పిందని అన్నారు. అంతే కాకుండా అవసరమైన చోట 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని న్యాయస్థానం సూచించిందని ఆమె తెలిపారు.

మైనార్టీలు ఇతర అన్ని వర్గాల కంటే వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లు అనడం సరికాదని సూచించారు. రిజర్వేషన్లపై అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు కల్పించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

  • Loading...

More Telugu News