oscars 2018: ఆస్కార్ అవార్డు దొంగలించి, తానే గెలిచినట్టు ఫొటోలకు పోజులిచ్చిన దొంగ

  • ‘త్రీ బిల్‌ బోర్డ్స్‌ ఔట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’ సినిమాకు ఉత్తమ నటి ఆస్కార్ అవార్డ్ సొతం చేసుకున్న ఫ్రాన్సెస్‌ మెక్‌ డార్మండ్‌
  • ఆస్కార్ గెలుచుకున్న ఆనందంలో సంబరాల్లో మునిగిపోయిన ఫ్రాన్సెస్
  • అవార్డు దొంగిలించి జారుకున్న టెర్రీ బ్రయాంట్

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 90వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘త్రీ బిల్‌ బోర్డ్స్‌ ఔట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’ సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటి ఆస్కార్ అవార్డ్ ను ఫ్రాన్సెస్‌ మెక్‌ డార్మండ్‌ గెలుచుకుంది. ఆస్కార్ సొంతం చేసుకున్న సంతోషంలో ఫ్రాన్సెస్ సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయింది.

ఆమె ఆ సందడిలో ఉండగా, ఆమె ఆస్కార్ అవార్డ్ ను టెర్రీ బ్రయాంట్‌ (47) దొంగిలించాడు. అంతే కాకుండా ఆ అవార్డు తానే గెలుచుకున్నంత సంతోషంతో దానిని పట్టుకెళ్తూ, ఫొటోలకు పోజులిచ్చాడు. అతని చేతిలో ఆస్కార్ గుర్తించిన పలువురు అది ఎవరిదని నిలదీశారు. దీంతో దానిని తాను చోరీ చేసినట్టు అంగీకరించడంతో వారు అతనిని పోలీసులకు అప్పగించారు.

ఆ తరువాత తన అవార్డు పోయిన విషయాన్ని గుర్తించిన ఫ్రాన్సెస్‌, డాల్బీ థియేటర్ మొత్తం వెతికింది. ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరవుతూ, పోలీసులను ఆశ్రయించింది. దీంతో దొంగను పట్టుకున్నామని, అవార్డు తమ వద్ద ఉందని తెలుపడంతో పోలీసులకు ఫ్రాన్సెస్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News