Malaysian university: విమానంలో నగ్నంగా బంగ్లా స్టూడెంట్ హల్‌చల్...అరెస్ట్

  • బట్టలు లేకుండా టాయిలెట్‌కు..సీటుపైనే మూత్రవిసర్జన
  • మహిళా సిబ్బందిని కౌగిలించుకునేందుకు యత్నం
  • వారించిన వారిపై దాడి...చివరకి అరదండాలు

ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు శృతిమించి వ్యవహరిస్తున్నారు. సమాజంలో నలుగురి మధ్య ఉన్నామన్న సంగతిని మరిచి ప్రవర్తిస్తున్నారు. మలేసియా విమానంలో తాజాగా ఓ జుగుప్సాకర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ 20 ఏళ్ల విద్యార్థి విమానంలో నగ్నంగా మారి, అశ్లీల వీడియోలు చూడసాగాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. 'స్టార్ ఆన్‌లైన్' తెలిపిన వివరాల్లోకెళితే....బంగ్లాదేశ్‌కి చెందిన నిందిత ప్రయాణికుడు మలేసియాలోని ఓ యూనివర్శిటీలో చదువుతున్నాడు. కౌలాలంపూర్ నుంచి ఢాకా బయలుదేరిన విమానంలో ఎక్కాడు. ఒంటిపైన నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా టాయిలెట్‌కు వెళ్లాడు. మరోవైపు తన సీటుపైనే మూత్రవిసర్జన కానిచ్చేశాడు.

టాయిలెట్‌కు వెళ్లే మార్గంలో విమానంలోని మహిళా సిబ్బందిలో ఒకర్ని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో బట్టలు తొడుక్కోమని చెప్పినందుకు సిబ్బందిలోని మరొకరిపై అతను దాడికి తెగబడ్డాడు. బట్టలు వేసుకోమని సిబ్బంది అతనికి మర్యాదపూర్వకంగానే చెప్పారని ప్రత్యక్ష సాక్షి 'ది సన్ డైలీ'కి చెప్పారు. ఎంతచెప్పినా వినకపోవడంతో విమాన సిబ్బంది ఓ బట్ట తీసుకుని అతని రెండు చేతులు కట్టేశారు. ఢాకాలో విమానం ల్యాండ్ కాగానే అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇదంతా నిజమేనంటూ విమాన యాజమాన్య సంస్థ 'మలిందో ఎయిర్' తన ప్రతినిధి ద్వారా తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో స్పష్టం చేసింది. ప్రస్తుతం నిందితుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Malaysian university
Malindo Air
Bangladeshi
Dhaka
Kuala Lumpur
  • Loading...

More Telugu News